నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బడ్జెట్‌లో విద్యకు 12శాతం నిధులు కేటాయించాలని సోషల్ డెమోక్రాటిక్ ఫోరమ్(ఎస్‌డీఎఫ్) ప్రతిపాదించింది. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘విద్యా ఎలా ఉండాలి-ఎస్‌డీఎఫ్ ప్రతిపాదనలు’ అనే అంశంపై ఎస్‌డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి మాట్లాడుతూ ప్రతి మండలంలో 5 కెేంద్రీయ విద్యాలయాల లాంటి బడులు కట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి బడిలో 2000 – 2500 మంది విద్యార్థులు చదువుకునేటట్లు 85 గదులు, ఆటస్థలాలు నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు.