సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం…

– చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చారిత్రాత్మకం
– ఎస్సీ కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎం రేవంత్ రెడ్డి
– కాంగ్రెస్ పార్టీకి మాదిగ జాతి రుణపడి ఉంటుంది
– కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ – హన్మకొండ
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ కులాల చిరకాల వాంఛ అయిన వర్గీకరణ ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ చరిత్రలోనే మొదటి సీఎం అని కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ బుధవారం రోజున పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కులగనన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి, బీసీ జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతగా పరకాల పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం సామాజికంగా, రాజకీయంగా తెలంగాణలోని బీసీల వెనుకబాటుతనాన్ని గుర్తించి సమగ్ర సర్వే జరిపి, చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న గొప్ప సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా ఎస్సీ కులాలు వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలువడిన గంటలోనే స్పందించి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఎస్సీ వర్గీకరణ తో వారి కుటుంబాలలో వెలుగులు నింపిన వ్యక్తి ముఖ్యమంత్రి అని అన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి గత 30 40 సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారు ఈరోజు మాదిగ జాతి మరియు మాదిగ ఉపకులాలకు న్యాయం చేసిన వారు ఈరోజు వారి స్ఫూర్తి వారి పోరాట ఫలితాన్ని చూసి చదివించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు పెట్టడం చాలా సంతోషకరమైన విషయమని అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 59 కులాలను మూడు విభాగాలుగా చేసి 15 కులాలు ఒక భాగం రెండో భాగం 18 కులాలు మూడో భాగం 26 కులాలు కలిపి ఈరోజు మేమంతా మాకంత అనే సంకల్పాన్ని వారు నిజం చేసిన మహా నాయకుడు ఈరోజు దేశ చరిత్రలో గొప్ప సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని కొయ్యడ శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో, మాజీ కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ మడికొండ సంపత్ చిన్నాల గోనాథ్ ఎక్స్ ఎంపీపీ ఉంటే రామ్మూర్తి మెరుగు శ్రీశైలం మడికొండ శీను అబ్బ శ్రీనివాస్ ఒంటరి శ్రావణ్ పోరండ్ల వేణు రఘునారాయణ రఘుపతి గౌడ్ సదన నందన్ గౌడ్ పసుల రమేష్ అనిల్ ఏకరాజు దారణ వేణుగోపాల్ పసుల విజయ లక్కం వసంత బొమ్మగంటి చంద్రమౌళి అలేటి రాజు ఎండి జాఫర్ లాడే శ్రీకాంత్ మచ్చ సుమన్ జెమిని గడ్డం శివ చంద్రమౌళి రమేష్ మొగిలి రమేష్ శీను మల్లేష్ చందు ఆది తాజ్ బాబా మరియు తదితరులు పాల్గొన్నారు