సోషల్‌ మీడియాను మేనేజ్‌ చేయవచ్చు… ప్రజలను చేయలేరు

– బీఆర్‌ఎస్‌ నేతలకు సినీ నిర్మాత బండ్ల గణేష్‌ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాను మేనేజ్‌ చేయవచ్చు కానీ ప్రజలను మేనేజ్‌ లేదని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని చెప్పారు. షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జనమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలు ఈనెల 30 కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ త్యాగాలు చేసిందన్నారు. కురుక్షేత్ర మహా సంగ్రామంలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.