
నవతెలంగాణ – నెల్లికదురు
మండలంలోని బడి తండా గ్రామ శివారు సొసైటీ తండాలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఎర్రబెల్లి గూడెం పల్లె దావకాన డాక్టర్ రవళి తెలిపారు. గురువారం సొసైటీ తండాలో స్థానిక వైద్యాధికారి నందన ఆదేశాల మేరకు వైద్య శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలు చేసి మందులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బడి తండా గ్రామ శివారు సొసైటీ తండాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి సుమారు 70 మందికి ఓపిని చూసి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచిత మందులను అందిస్తున్నామని అన్నారు. ఈ గ్రామంలో 95 ఇండ్లలో ఇంటింటి సర్వే నిర్వహించి రాపిడు ఫీవర్ సర్వే మలేరియా సర్వే నిర్వహించిన అనంతరం డెంగ్యూ వచ్చిన వారి ఇండ్ల వద్దకు వెళ్లి వారిని పరిశీలించి వారి ఇంటి పరిసర ప్రాంతంలో స్ప్రే చేయించి తగు సూచనలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఏ విధులలో చెత్తాచెదారం లేకుండా ఎవరి ఇంటి ముందు వారు శుభ్రపరచుకోవాలని అన్నారు. ఎవరిళ్ల ముందు నీటి నిల్వలు లేకుండా చూసుకోనే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా నిర్వహించినట్లయితే ఈ సీజన్ వ్యాధి నుండి బయటపడవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గణేష్ ఏఎన్ఎం రమాదేవి అంగన్వాడీ టీచర్ కవిత ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.