పెద్దంపేటలో సోషియ ఎకనామిక్ సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు 

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలంలోని సింగరేణి ప్రభావిత గ్రామమైన పెద్దంపేట గ్రామంలో రెవెన్యూ అధికారులు సోమవారం సోషియా ఎకనామిక్ సర్వే నిర్వహించారు. సింగరేణి అవసరాల కోసం  పెద్దంపేట గ్రామంలోఎకరా 12 గుంటల పట్టా భూమి లో ఉన్నటువంటి నివాస గృహాలకు సింగరేణి ఓసిపి త్రీ విస్తరణ కొరకై సేకరించుటకు గాను నోటిఫికేషన్ గెజిట్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ గృహాల కుటుంబ సభ్యులకు కొత్త చట్టం ప్రకారం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పరిహారం చెల్లించుట కొరకు రెవిన్యూ అధికారులు ఇంటింటికి వెళ్లి  సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో తాజా మాజీ సర్పంచ్ చింతపట్ల నాగరాజు, రామగిరి తహసిల్దార్  రామచందర్రావు సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్ సునీత , నాయబ్ తహసిల్దార్  సుదాటి కోటేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ నర్సింగం ,ఆర్ఐలు నిహారిక, జూనియర్ అసిస్టెంట్ మౌనసాగర్, గ్రామస్తులు పాల్గొన్నారు.