సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా సోడెం ప్రసాద్..

– ఏడుగురితో కార్యదర్శి వర్గం
నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ(ఎం) అశ్వారావుపేట మండల కార్యదర్శిగా సోడెం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని గుంటిమడుగులో సోమవారం పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో నిర్వహించిన 9వ మండల మహాసభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లాలో కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు పుల్లయ్య పర్యవేక్షణలో 20 మందితో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.
అనంతరం మండల కమిటీ సభ్యులు సోడెం ప్రసాద్ ను మండల కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత నూతన మండల కార్యదర్శిగా ఎన్నికైన ప్రసాద్ ఏడుగురు (7)తో మండల కార్యదర్శి వర్గాన్ని ప్రకటించారు. కార్యదర్శిగా సోడెం ప్రసాద్, కార్యదర్శి వర్గం సభ్యులుగా బి.చిరంజీవి, మడకం గోవిందు, ముల్లగిరి గంగరాజు, కారం సూరిబాబు, మడిపల్లి వెంకటేశ్వరరావు, తగరం నిర్మల, మండల కమిటీ సభ్యులుగా కలపాల భద్రం, గడ్డం సత్యనారాయణ, చొక్కా సీతారామయ్య, నారం అప్పారావు, కుంజా మురళీ కృష్ణ, బండి ఏసు, మడకం నాగేశ్వరరావు, తుట్టి వీరభద్రం, కొర్సా పెంటారావు, వర్షా శ్రీ వేణు, మొడియం దుర్గా రావు, మొడియం తిరుపతమ్మ, వెట్టి కుమారిలను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కార్యదర్శిగా ఎన్నికైన ప్రసాద్ మండలంలోని గుంటిమడుగు వాసి.10 వ తరగతి వరకు చదువుకున్న ఈయన 2001 లో పార్టీలో చేరారు. 2011లో మండల కమిటీ సభ్యుడు గా ఎన్నికైన ప్రసాద్ హోల్ టైమర్ గా పని చేసారు. డివిజన్ కమిటీ సభ్యులుగా పనిచేసారు. పోడు భూములు పోరాటంలో ఈయనపై ఆరు(6) కేసులు నమోదు అయ్యాయి. ఈ మండలంలో చిరంజీవి, ఎస్.కే బాబా, ధర్ముల సీతారామయ్యలు ఇప్పటి వరకు మండల కార్యదర్శులుగా పనిచేసారు. నాలుగో కార్యదర్శిగా సోడెం ప్రసాద్ పార్టీకి సేవలు చేయనున్నారు.