బోరబండలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

నవతెలంగాణ హైదరాబాద్: కళ్యాణ్ నగర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనంత కుమార్(44) శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరుణ బెడ్ రూమ్ డోర్ కొట్టగా అతని స్పందన లేదు.  దీంతో ఆమె కిటికీ నుంచి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించడంతో చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో డోర్ పగలగొట్టి అతని దించారు. అప్పటికే అతను చనిపోయినట్టు గుర్తించారు. ఇతని యొక్క వాడిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఎస్సై స్వప్న రెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయుచున్నారని బోరబండ సిఐ కామల్ల రవికుమార్ తెలియజేశారు. ఇతనికి భార్య ఒక కూతురు ఉన్నారు.