లక్ష్యం మేరకు మట్టి బ్యాగులను సిద్ధం చేయాలి

నవతెలంగాణ-  కమ్మర్ పల్లి
 మొక్కల పెంపకానికి లక్ష్యం మేరకు మట్టి బ్యాగులను సిద్ధం చేయాలని సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం మండలంలోని హాసకొత్తూరు  గ్రామంలోనీ నర్సరీని ఆమె సందర్శించి పరిశీలించారు. నర్సరీలో మొక్కలు పెంచడానికి సిద్దం చేస్తున్న మట్టి నింపిన పాలిథిన్ బ్యాగ్స్ లను ఈ సందర్భంగా ఆమె పరిశీలించారు. ఇప్పటికే నర్సరీలో సిద్ధం చేసిన వివిధ రకాల మొక్కలను ఆమె పరిశీలించారు. అనంతరం సర్పంచ్ పద్మ రాజేశ్వర్ మాట్లాడుతూ హరితహారం లో భాగంగా గ్రామంలో నాటేందుకు నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీలో మొక్కలను సిద్ధం చేయాలని  నర్సరీ నిర్వాహకులకు సూచించారు.మొక్కలకు సమయానికి నీటిని అందించి సంరక్షించాలన్నారు. ఎండిపోయిన, నాటుకోని మొక్కల స్థానంలో కొత్త మొక్కలను పెంచాలని సూచించారు.