నేల – వాన!!

వానకు నేల నాని నాని నాణ్యమౌతుంది
నాణ్యమైన నేలలో విత్తనాలు పండి
కిసాను దోసిట్లో భవిష్యత్తు పంటలకు
నాణాలు అవుతాయి
వట్టి వాన పంట కాదు వట్టి నేలా పంట కాదు
వాన నేల కలిస్తేనే పంట పండగ
దేశం ఆకలి దోషం పోతుంది
అసలు వానను నేలను నమ్ముకున్న రైతే
ప్రపంచాన అధినాయకుడు!
అందరూ ప్రేక్షకమాత్రులు
ఉన్నవాడు లేని వాడు రోజూ మూడు పూటలూ
మరిచి పోకుండా కతజ్ఞతలు చెప్పాల్సిందే
లేకుంటే తిన్నది అరగదు సుమా!!
– కందాళై రాఘవాచార్య, 8790593638