సోలార్‌ కార్‌ వచ్చేసింది..!

Solar car has arrived..!– వేవ్‌ మొబిలిటీ ఆవిష్కరణ
న్యూఢిల్లీ : విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ వేవ్‌ మొబిలిటీ కొత్తగా సోలార్‌తో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనం ఈవీఏను ఆవిష్కరించింది. శనివారం దీన్ని ఆటోమొబైల్‌ ఎక్స్‌పోలో విడుదల చేసింది. మూడు వేరియంట్లలో లభ్యం కానున్న దీని ధరల శ్రేణీని రూ.3.25 లక్షల నుంచి రూ.6 లక్షలుగా ఉండొచ్చని అంచనా. 2026లో దీని ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎంపిక చేసిన నగరాల్లో తొలుత వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నామని వేవ్‌ మొబిలిటీ సీఈఓ విలాస్‌ దేశ్‌పాండే తెలిపారు. సగటున ప్రతి రోజూ 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చన్నారు. విద్యుత్‌ చార్జింగ్‌తో కూడా 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందన్నారు.