మైనంపల్లికి ఘన స్వాగతం

నవతెలంగాణ -దుబ్బాక 
కూడవెల్లి జాతరకు వచ్చిన మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావుకు కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు.అక్బర్ పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి లోని కూడవెళ్లి రామలింగేశ్వరయానికి కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు కొంగర రవి,కడ్డూరి నరేందర్ రెడ్డి,పాతూరి వెంకటస్వామి గౌడ్, పలువురు నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.