‘నిజం గెలవాలి’కి తెలుగు మహిళల సంఘీభావం

To 'Truth should prevail'
Solidarity of Telugu womenనవతెలంగాణ-హైదరాబాద్‌
కార్యకర్తల కోసం నేనున్నా నంటూ నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం సఫలీ కృతం కావాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి, ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. బుధ వారం హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో మీడియాతో సంయుక్తంగా మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మరణించిన వారి కుటుంబాలను ‘నిజం గెలవాలి’ బస్సు యాత్ర ద్వారా పరామర్శించనున్నారని చెప్పారు. బాబును జైల్లో నిర్భందించి 47 రోజులైనా, తన భర్త బాధ్యతను స్వీకరించడమే అభినంద నీయమన్నారు. ఈ యాత్రకు మేమంతా మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. ఏపీలో అప్రకటిత కర్ఫూను అమలు చేస్తూ. కార్యకర్తల ధైర్యాన్ని దెబ్బ తీయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తున్న దన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయిలా అడుగులేస్తున్న భువ నేశ్వరి వెనుక మేమున్నా మని చెప్పారు. స్వాతంత్య్రోద్యమంలో సరోజినీ నాయుడు, అనిబిసెంట్‌ తరహా పాత్రను నేడు భువనేశ్వరి పోషిస్తున్నారని వివరించారు. కార్యకర్తల్లో నైరాశ్యం పోగొట్టడానికి ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. చంద్రబాబు ఆదర్శాలు భువనేశ్వరి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. సమా వేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుడిగి అనూప్‌ కుమార్‌ పాల్గొన్నారు.