– ఇజ్రాయిల్ దాడులను ఖండించిన నేతలు
– జంతర్ మంతర్ వద్ద ఏఐపిఎస్‌ఓ ఆందోళన
న్యూఢిల్లీ : పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న క్రూరమైన దాడులకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ (ఏఐపీఎస్‌ఓ) ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జంతర్ మందర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. సామూహిక మారణహౌమ ముప్పును ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆందోళన ప్రకటించింది. కార్మికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులు అందరూ పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నాయకులు నిలోత్పల్ బసు, ఆర్ అరుణ్ కుమార్, జి. దేవరాజన్, ఎంపి పి. సంతోష్ కుమార్, ఏఐకేఎస్ కోశాధికారి పి కృష్ణప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను, లాయర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పివి సురేంద్రనాథ్, ప్రొఫెసర్ శాశ్వతి మజుందార్, న్యాయవాది సుభాష్ చంద్రన్, వివేక్ శర్మ, ఐద్వా నాయకులు మైమూనా మొల్లా, సాయి ప్రసాద్ మాట్లాడారు.