
సిద్దిపేట జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దుబ్బాక నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి లు రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారని సమాచారం. దీంతో దుబ్బాక టిఆర్ఎస్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.