రాజిరెడ్డి కుటుంబానికి సోలిపేట పరామర్శ

నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
ఇటీవల దుబ్బాక మండల పరిధిలోని గోసాన్ పల్లి గ్రామానికి చెందిన అక్క రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకుని శనివారం వారీ కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజి రెడ్డి మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, వారీ కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి తిరుపతి రెడ్డి , ఎంపీటీసీ లక్ష్మి నారగౌడ్,రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నర్సింలు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు హరిబాబు,  సోషల్ మీడియా అధ్యక్షులు కొమ్ము బాలరాజు, బీఆర్ఎస్వి అధ్యక్షులు ఎండి కదార్ , ఉప అధ్యక్షులు సలంద్రి మహేష్, నాయకులు మాడుగుల నర్సింలు,పాకనాటి రాజు,క్రాంతి కుమార్ రెడ్డి, అంబటి రఘువరన్ గౌడ్, కొమ్ము స్వామి, అక్క యాదవ రెడ్డి తదితరులు ఉన్నారు.