నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని టికారం తాండ గ్రామపంచాయతీ పరిధిలో గల సర్దార్ తాండా,టికారం తండా గ్రామాలకు త్రాగునీటి సమస్య అనేకంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు చొరవతో పైప్ లైన్ ఏర్పాటుకు కృషి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరు సరిగ్గా రాకపోవడంతో తండావాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి అంజనీ గ్రామం నుండి టికారం తాండ సర్దార్ తాండ వరకు పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి మాజీ సర్పంచ్ నాగిరెడ్డి మోహన్, మైనార్టీ మండలం నాయకులు రషీద్ తాండా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికుల పాల్గొన్నారు.