ప్రభుత్వాస్పత్రుల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించండి

– డీఎంఈకి ఏఐటీయూసీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వాస్పత్రుల్లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌ డీ యూసుఫ్‌, ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ తదితరులు రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ వాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ త్వరలోనే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని డీఎంఈ హామీ ఇచ్చినట్టు తెలిపారు.