– రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు టీజేఎమ్‌యూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్ ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి యూనియన్లకు అనుమితివ్వాలనీ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీజేఏమ్‌యూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీని విలీనం చేయాలనీ, సంస్థ బకాయిలను వెంటనే చెల్లించాలని విన్నవించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని అసెంబ్లీలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, టీజేఎమ్‌యూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్వాములయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్, జీవీకే రెడ్డి, కళ్యాణి, అరుణ, కుసుమకుమారి, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సంస్థ, కార్మికుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారని హన్మంతు ముదిరాజ్ తెలిపారు.