నగరంలోని ఉప్పల్ నుంచి బోడుప్పల్ వెళ్లే రోడ్డుపై ఉన్న డ్రెయినేజీ నీరు వారానికి ఓసారి పొంగి పొర్లుతోంది. ఈ నీరంతా కూడా కాలనీల్లోకి ప్రవేశించడంతో రోడ్ల మీద పాదచారులకు నడవం ఇబ్బంది అవుతున్నది. అలాగే డ్రెయినేజీ కంపుతో దుర్వాసన వస్తున్నది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం స్థానిక కార్పొరేటర్‌కు కాలనీవాసులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ అధికారులకు ఆన్లైన్ ద్వారా కంప్లయింట్ ఇస్తే వచ్చి క్లియర్ చేస్తారు. కానీ రోడ్లపైనున్న డ్రెయినేజీ చెత్తను తొలగించడం లేదు. దీంతో మరల కంప్లయింట్ ఇస్తే వచ్చి క్లియర్ చేసేసరికి మళ్లీ రోడ్డు మీద డ్రెయినేజీ పొంగుతున్నది. ఇది రోజూ షరామామూలైంది. ఈ సమస్యపై దాదాపు ఏడాది కాలంగా కార్పొరేటర్‌కు విన్నవిస్తే పట్టించుకోవడం లేదని కాలనీవాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక్క డ్రెయినేజీనే కాదు రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉన్నది. చిన్నపాటి వర్షానికి పూర్తిగా గుంతలు, రాళ్లు పైకి లేచి వస్తున్నాయి. చిన్నచిన్న యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఉదయం, సాయంత్రం అనేక స్కూల్ బస్సులు, ఆటో లు ఈ రోడ్డున వెళ్తుంటాయి. అయినా కూడా అధికారులు రోడ్డును బాగు చేద్దామనే ఆలోచనకు రావడం లేదు. కనీసం కార్పొరేటర్ అయినా పట్టించుకుంటారనే ఈ సమస్యలను గాలికొదిలేశారు. వాస్తవానికి ఈ డ్రెయినేజీ సమస్య చాలా చిన్నది. పౖౖెనుంచి వస్తున్న దురేనేజ్ లైన్‌ను స్ట్రెయిట్‌గా కలిపేస్తే ఆ వాటర్ ఇరు పక్కలకు పొంగకుండా ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉన్నది. ఇప్పటికైనా ఈ డ్రెయినేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
– ఎస్ఎస్ఆర్ఎ ప్రసాద్, 9490300867