సమస్యలను పరిష్కరించండి

– మంత్రికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆయన నివాసంలో కలిసిన నాయకులు వినతిపత్రాన్ని సమర్పిం చారు. అనంతరం వారు మాట్లాడు తూ మంత్రి తమ వినతిపత్రంపై సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ వి.రాకేష్‌, కార్యదర్శి డాక్టర్‌ హరి ప్రకాష్‌ తదితరులున్నారు.