సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

– రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ –  కామారెడ్డి 
తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా 25వ రోజు సావిత్రిబాయి పూలే  విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్  అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడుతూ పెద్దగా వేతనాలు రావడం లేదని అయినప్పటికీ  సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సేవలు మరువలేనివని గత కొన్ని రోజుల నుంచి చేస్తున్న పోరాటం న్యాయమైనదని ప్రభుత్వం గుర్తించి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ సంఘం మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం జిల్లా ఉపాధ్యాయుల ఐక్యవేదిక కమిటీ  సభ్యులు మాట్లాడుతూ  ప్రభుత్వం మొండి వైఖరి మానాలని  విద్యా బోధన బంద్ అయిన ఎమ్మార్సీలకు తాళాలు పడిన  ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సందర్భంగా టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ  ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చేశారు.
         ఉద్యోగులు మాట్లాడుతూ  రాబోయే క్యాబినెట్ సమావేశంలో తమ సమస్యలు లేవనెత్తి పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మద్దతు తెలిపిన వారిలో టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు లింగం, యస్ సి, యస్ టీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు ప్రవీణ్, సంగయ్య, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎంసీ ప్రభాకర్, టిపిఆర్ టు జిల్లా అధ్యక్షులు అంబిర్ మనోహర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజ్యం, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు కుశాల్, ఎస్టియు జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు, బార అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, క్యాతం సిద్ధిరాములు, ప్రాథమిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల జిల్లా అధ్యక్షులు పందిరి రాజేష్, యు ఎస్ ఎస్ జిల్లా అధ్యక్షులు,  ఉపాధ్యాయ సంఘ నాయకులు శ్రీహరి, సత్యం, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు యాదయ్య, అయ్యల సంతోష్, ఉపాధ్యాయ ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ఉపాధ్యాయ సంఘాల జాక్టో కామారెడ్డి శాఖ సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులు చేస్తున్న నిరవధిక సమ్మెకు పూర్తిస్థాయి మద్దతు తెలుపుతూ వారి డిమాండ్ ను ప్రభుత్వము పరిగణలోకి తీసుకొని తక్షణమే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా శిబిరం వేదికగా డిమాండ్ చేశారు.  జిల్లా సంఘం అధ్యక్షులు సత్యనారాయణ నాయకులు సంపత్, వాసంతి, రాములు, సంతోష్ రెడ్డి,వనజ, కాళిదాస్, వీణ,మాధవి,శైలజ, సంధ్య,దినేష్, జిల్లా ఉద్యోగులు పాల్గొన్నారు.