నిరుద్యోగులకు అండగా నిలుస్తా విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తా 

– పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దేవునూరి రవీందర్
నవతెలంగాణ – సిద్ధిపేట 
నిరుద్యోగులకు అండగా నిలుస్తూ, వారి పక్షాన ప్రభుత్వంతో పోరాడుతానని  కరీంనగర్  స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవుని రవీందర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజాంబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ  తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఉచితంగా న్యాయ సేవలు అందించానన్నారు.  అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ,  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వంతో పోరాడి ఫ్యాక్టరీలు, ఇతర సంస్థలలో ఏర్పాటు చేసే విధానం కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతిని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు చదువుకొని అవకాశం కల్పించే విధానం పోరాడుతానన్నారు. పోటీ పరీక్షల్లో నిరుద్యోగులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానం పోరాడుతానన్నారు. పట్టభద్రుల ఉద్యోగం పొందాక వారికి పెన్షన్ విషయంలో  రాజీ లేకుండా  పోరాడుతానన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే విధంగా మండలిలో తన గొంతును వినిపిస్తానన్నారు. నేను ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేర్చుతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు, పట్టభద్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే నిరాహార దీక్షకు కూడా వెనకాడనన్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని పట్టబద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పత్రి ప్రకాష్,  ఎగుపతి, బాలరాజు, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.