సమస్యల పరిష్కారం ఎర్రజెండాతోనే సాధ్యం

సమస్యల పరిష్కారం ఎర్రజెండాతోనే సాధ్యం– కమ్యూనిష్టులు లేని అసెంబ్లీ పుస్తకం లేని గ్రంథాలయం లాంటిది
– పగడాల యాదయ్యను అసెంబ్లీకి పంపాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ
– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను ప్రజలు నమ్మొద్దు
– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్‌ రాములు
– ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగు పెడతా
– నియోజకవర్గంను అభివృద్ధి చేయడంలో మంచిరెడ్డి విఫలం
– సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం అభ్యర్థి పగడాల యాదయ్య పాషా, నరహరిల గ్రామం జపాల్‌ నుంచి ప్రచారం ప్రారంభం
నవతెలంగాణ-మంచాల
ప్రజా సమస్యల పరిష్కారం కమ్యూ నిస్టులతోనే సాధ్యం అని, కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ పుస్తకం లేని గ్రంథాలయం లాంటిద ని, ఓటర్లు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్యను అసెంబ్లీకి పంపాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మండలంలోని పలు గ్రామాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్య ప్రచా రం నిర్వహించారు. కామ్రేడ్స్‌ పాషా, నరహరిల స్వగ్రామం జపాల్‌ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాన్‌వెస్లీ మాట్లాడారు.. పోరాటాల గడ్డ జపాల్‌ నుంచి ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇబ్రహీం పట్నంలో అభివృద్ధి జరిగిందన్నారు. అప్పుడు ఉన్న ప్రభుత్వాలతో కొట్లాడి మరీ నిధులు తీసుకొచ్చారని గుర్తు చేవారు. పాఠశాలలల నిర్మాణం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, గ్రామాల్లో సీసీరోడ్లు వేసినట్టు తె లిపారు. రైతులకు సాగునీరు అందించారని తెలిపా రు. ఇతర ఎమ్మెల్యేలు చేసిందేమీ లేదన్నారు. భవిష్య త్తులో కూడా నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా.. ప్రజా సమ్యలు పరిష్కారం కావాలన్నా.. సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్‌ రాములు మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు డబ్బు, మద్యంతో ఓట్లు కొనగోలు చేయాలని చూస్తున్నారని అన్నారు. వారి మాయమాటలకు మోసపోవద్దని సూ చించారు. అధికారం కోసం అమలు కానీ మేనిఫెస్టో విడుదల చేసి, అధికారంలోకి రాగానే వాటిని విస్మ రిస్తున్నారని అన్నారు. ఆ పార్టీల అభ్యర్థులను ఓడిం చాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే కమ్యూనిస్టు పార్టీల నాయకులను గెలిపించాలని తెలిపారు.
సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం అభ్యర్థి పగడాల యాదయ్య మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో అసెం బ్లీలో అడుగు పెడతానని అన్నారు. 15ఏండ్లుగా ఇబ్రహీంపట్నంను అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధులు, నియమకాలు, నీళ్లు వస్తాయని భావిస్తే ఒరిగిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ధరణి పేరుతో పేదల భూములను లాక్కున్నారని మండిపడ్డాడు. గతంలో ఇచ్చిన ప్రభుత్వ భూములు, సీలింగ్‌, పోరంబోకు, అసైండ్‌ భూములకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వలేదని అన్నారు. దాంతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రైతులు భూములు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి మద్యం, డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసే కుట్ర చేస్తున్నాడని అన్నారు. వీరికి ఓట్లతోనే బుద్ధి చెప్పాల న్నారు. పాషా, నరహరిల ఆశయాలను సాధించాలం టే తమతోనే సాధ్యం అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు బి. స్వామెల్‌, మండల కార్యదర్శి ఎన్‌.శ్యామ్‌సుందర్‌, జిల్లా కమిటీ సభ్యులు కే.శ్రీనివాస్‌ రెడ్డి, కే.జగన్‌, జీ.నర్సింహ, ఆర్‌.జంగయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.రాజు, డి.మమత అజరుబాస్‌, పి.కృష్ణ, లెనిన్‌, హాఫిజ్‌ పాషా, పార్టీ జపాల్‌ గ్రామ కమిటీ కన్వీనర్‌ యాట పాండు, సర్పంచ్‌ సయ్యద్‌ నహీద రావుఫ్‌, ఎంపీటీసీ లట్టుపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మండల కమిటీ సభ్యులు ఏ.జం గయ్య, ఏ.యాదయ్య, ఎం.ఫయాస్‌, చీదేడ్‌ సర్పంచ్‌ బైరిక రమాకాంత్‌రెడ్డి, బండ లేమూర్‌ మాజీ సర్పంచ్‌ పి .వీరయ్యగౌడ్‌, మాజీ ఎంపీటీసీ యాట జగన్‌, జపాల్‌ కో-ఆప్షన్‌ సభ్యులు ఓరుగంటి భాస్కర్‌గౌడ్‌, అవాజ్‌ సంఘం నాయకులు సయ్యద్‌ రజాక్‌ పాషా, వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.