ప్రజాదర్బారు లో.. ప్రజా సమస్యలు పరిష్కారం 

– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
– భారీగా తరలివచ్చిన ప్రజలు 
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయ సమీపంలో గల మున్సిపల్ పార్కులో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం ప్రజా దర్బారు నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వివిధ సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. పలు సమస్యలను మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.అదేవిధంగా కొంతమంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.