– కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం
– జుంటుపల్లిలో బీఎంఆర్ ఆత్మీయ పలకరింపు
– తాండూర్ కాంగ్రెస్ కంచుకోటను తిరిగి కైవసం చేసుకుంటాం
– డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్ రెడ్డి
– ప్రముఖ వైద్యులు సంపత్ కుమార్
నవతెలంగాణ-యాలాల
కాంగ్రెస్‌తోనే ప్రజా సమస్యల పరిష్కారమని డీసీసీ బీ చైర్మన్ బి.మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు గడ్డపై కాంగ్రెస్‌ను పుర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనో హర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జుంటిప ల్లి శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో ఆయన, ప్ర ముఖ వైద్యులు సంపత్ కుమార్, మండల మాజీ అధ్య క్షు లు భీమయ్య, యువ నాయకులు చంద్రశేఖర్ గౌడ్‌తో కలి సితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జుంటి పల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటికీ బీఎంఆర్ ఆత్మీ య పలకరింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీ బీ అధ్యక్షులు బి.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజాసమ స్యలు తీర్చాలంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేప ట్టాలని అందుకోసం ప్రతి కార్యకర్త కృషి ఉండాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రం తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక విఫలం చెం దారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, నిధులు, నీళ్ల, నియామకాలు తెలంగాణ ట్యాగ్ లైన్ ఏమైందని ప్ర శ్నిం చారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, రైతాంగం, యువత, డిక్లరే షన్ చూసి బీఆర్‌ఎస్‌లో గుబులు పుట్టిందన్నారు. తాం డూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ఎవరి పేరు ప్రకటించిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నా మని చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రజల్లోకి చేరవేయ డమే లక్ష్యంగా కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. 45 రోజుల పాటు తాండూ రు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం గ్రామ గ్రామా నా కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తే, గెలుపొందిన ఎమ్మెల్యే మన కోసం 5 ఏండ్లు సేవకుడిగా పనిచేస్తారని తెలిపారు. తాండూర్ ప్రజలందరి ఆశీర్వాదంతో తాం డూర్ కాంగ్రెస్ కంచుకోటను తిరిగి కైవసం చేసు కుంటా మని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నా యకులు బి.సత్యం రెడ్డి, అక్కంపల్లి మల్లప్ప, గంతల మైనుద్దీన్, వడ్ల శ్రీనివాస్‌చారి, అనంతయ్య, సాయిలు, ఖాసీం, ప్రశాంత్, వివిధ గ్రామాల నాయకులు, కార్య కర్తలు, పాల్గొన్నారు.