క్షత్రియ సేవా సమితికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీకి సువర్ణ అవకాశం లభించింది. ఈ సమితి జాతీయ స్థాయిలో సేవలు అందించే బుద్ధం మేనేజింగ్ కమిటీ కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్షత్రియ సేవా సమితి జనరల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న అశ్వారావుపేట పట్టణ ప్రముఖులు కునాదరాజు సోమరాజును కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివరాల్లోకి వెళితే ఈనెల 22 న శ్రీశైలం లోని శ్రీ అల్లూరి సీతారామరాజు నిలయం క్షత్రియ అన్న దాన సత్రంలో క్షత్రియ సేవా సంఘం బుద్ధం మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షత్రియ సేవా సంఘం ఎన్నికలలో గత 23 సంవత్సరాలుగా ఈ సమితి ద్వారా శ్రీశైలం, భద్రాచలం,కాశి, షిరిడి పుణ్యక్షేత్రాలలో కళ్యాణ మండపాలు,నిత్య అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం తిరుపతిలో నూతనంగా సత్రం నిర్మాణం చేపట్టారు.క్షత్రియ సేవా సమితి కి ఆయన చేసిన సేవలను గుర్తించి ఏకగ్రీవంగా కునాదరాజు సోమరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనను ఆదరించి జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగించి నందుకు గాను ఉభయ తెలుగు రాష్ట్రాల క్షత్రియ సేవ సంఘం సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు చేశారు.