మౌనం మరీ..
ప్రశాంతమేం కాకపోవచ్చు!
దీర్ఘకాలం మంచి
సంభాషణలే గుర్తుంటాయేమో!!
లవణం
మంచినీళ్ళలో మిళితమై
మూలాల్ని చెరిపేసినట్లు..
జలసిరులు
సముద్రంలో కలిసి
ఉప్పుగా మారినట్లు..
నరులతో
సహవాసం పద్మవ్యూహం!
స్వార్ధానికి పేటేంట్లు వీళ్ళు!!
ఉద్వేగాల్ని
ఉన్నపళంగ రెచ్చగొట్టి
ఒకే ఒక్క క్రియతో
మనోభావాల్ని దెబ్బతీస్తారు!
అందరూ..
మనమాటే వినాలనేం లేదు!
సెప్పెటోళ్ళకు సూచనో, ఆజ్ఞో
నిర్దేశించే పరిణతి ఉండాలె కదా!!
అలాగని అన్నిసార్లు
మాటలతో పనేం జరుగదు !
చేతలతో..
నిరూపించుకోవాల్సే ఉంటది!!
పోరాటం..
సేయాల్సి వచ్చినప్పుడు
పెద్దయుద్ధమే జరగాలె!
పూలవాన కాదు
నిప్పుల వర్షమే కురువాలె!!
భావనలు, భావాలు
చెడ్డవైతే..
జీవితం ఏమంత రుచిగుండదు!
చెట్టు వికాసానికి
భూమి లోపలి వేర్లే కారణం!
మనిషి..
ఉనికికి మంచితనమే పునాది!
– అశోక్ అవారి, 9000576581