నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రభుత్వాలు ఆరోగ్య శ్రీ, ఆయూష్మాన్ భారత్ లు వర్తింప చేసిన వాటి పరిధిలో కొన్ని చికిత్సలే వస్తాయని, ఇతర చికిత్సలు ప్రయివేట్ లో చేసుకున్న వారికి సీఎం రీలిఫ్ ఫండ్ నుంచి కొంత ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 52 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ… ఇన్సురెన్స్ వచ్చిన అందరు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీలు వచ్చిన వైద్యంలో కొన్ని చికిత్సలు వాటి పరిధిలో రావన్నారు. ప్రయివేట్ ఆస్పత్రుల్లో లక్షలు కట్టితేకానీ నయం కానీ రోగాలున్నాయన్నారు. లక్షల బిల్లులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వేలు రావడంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి దరఖానాలో పేదోడికి వైద్య సేవలు ఉచితంగా అందించాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తవిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్, రఘుపతి, రవి, కృష్ణయాదవ్ పాల్గొన్నారు.