అనుకున్నవన్ని జరగవు కొన్ని..

All that is thought Some will not happen..శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ . శ్రీ భారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర పోస్టర్‌ను అల్లరి నరేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ టైటిల్‌ లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది. టైటిల్‌, పోస్టర్‌ ఆసక్తికరంగా ఉన్నాయి. దర్శకుడు నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయవంతమై టీమ్‌ అందరికీ మంచి పేరు రావాలి. దర్శకుడిగా సందీప్‌ బిజీ కావాలి’ అని అన్నారు.
‘క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఇది. నరేష్‌ క్రైమ్‌, కామెడీ జోనర్‌ చిత్రాలెన్నో చేశారు. ఈ టైటిల్‌ లాంచ్‌ చేయడానికి ఆయనే కరెక్ట్‌ అనిపించింది. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. నవంబర్‌ 3న సినిమాను విడుదల చేస్తున్నాం’ అని హీరో శ్రీరామ్‌ నిమ్మల చెప్పారు. దర్శకుడు సందీప్‌ మాట్లాడుతూ, ‘క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాం. ఆరిస్ట్‌లు అంతా అద్భుతంగా యాక్ట్‌ చేశారు. అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది. కామెడీని బాగా ఎంజారు చేస్తారు. నవంబర్‌ 3న విడుదల కానున్న మా చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. మా సినిమా పోస్టర్‌ విడుదల చేసిన నరేష్‌కి థ్యాంక్స్‌’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్‌ మౌనిక సినిమాలో అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి కెమెరా : చిన్నాహొ రామ్‌, జివి అజరుహొ
ఎడిటర్‌ : కె సీబీ హరి, సంగీతం : గిడియన్‌హొకట్ట, ఎక్సిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : బివిహొనవీన్‌.