
చండూరు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా ధోనిపాముల గ్రామానికి చెందిన సోము లింగస్వామి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి, ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యేకి, తనకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.
