తండ్రి గెలుపు కోసం తనయుడు ప్రచారం

– తుమ్మల యుగంధర్ కు స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.కె వసీం
– పలు డివిజన్ లో ఇంటింటికి తిరుగుతున్న తుమ్మల యుగంధర్..
నవతెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజవర్గ అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గెలుపు కోసం వారి తనయుడు తుమ్మల యుగంధర్ ఖమ్మం నగరంలోని పలు డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ నినాదంతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. తొలిత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.కె.వసీం తుమ్మల యుగంధర్ డివిజన్ కి వచ్చినందుకు శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు.. అనంతరం తుమ్మల యుగంధర్ పలు డివిజన్ లోని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి వివరించారు.ఈ కార్యక్రమంలో షేక్. ఇమామ్ మడూరి సైదారావు, షేక్. జానీమియా,ఫయాజ్, గౌస్ పాషా, రంజాన్, సయ్యద్ అహ్మద్, సయ్యద్ వాజిద్, షేక్.అబ్దుల్, రెహమాన్, తాజుద్దీన్,, ఖాదర్,ఇబ్రహీం,ఖాజా,ముజ్జు, తదితరులు పాల్గొన్నారు…