జాతీయ పోటీల్లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థి

జాతీయ పోటీల్లో
ప్రతిభ చాటిన గీతం విద్యార్థినవతెలంగాణ-పటాన్‌చెరు
గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ (సీఎస్బీఎస్‌) ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆదిత్య జాతీయ పోటీల్లో ప్రతిభ చాటి పతకాన్ని గెలుచుకున్నాడు. నవీ ముంబై ఉరాన్‌లో ఇటీవల జరిగిన 44వ ఓపెన్‌ నేషనల్‌ డెడ్‌ లిఫ్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. ఆదిత్య అద్భుత ప్రదర్శన, అంకితభావం, కృషికి, నిబద్ధతకు ఈ పతకం నిదర్శనం. జాతీయ పోటీల్లో అద్భుత విజయాన్ని అందుకున్న ఆదిత్యను గీతం ఉన్నతాధికారులు, క్రీడా శిక్షకులు, పలువురు అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఇలాంటి మరిన్ని విజయాలను ఇతర ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి కూడా చూడాలని వారు అభిలషించారు.