అంచనాలు పెంచిన పాటలు..

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. రత్నం కష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘డీజే టిల్లు’ ఫేమ్‌ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాని స్టార్‌ లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దివ్యాంగ్‌ లవానియా, మురళి కష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. అమ్రిష్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ‘ఎందుకు రా బాబు’, ‘సమ్మోహనుడా’, ‘నాలో లేనే లేను’ అనే మూడు పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టు కున్నాయి. ప్రతి పాట దేనికదే ప్రత్యేకను చాటుకుంటూ కట్టి పడేశాయి. పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ‘సమ్మోహనుడా’ మెలోడీ పాట యూట్యూబ్‌లో 14 మిలియన్ల మార్కును దాటి విశేష ఆదరణ పొందుతోంది. ‘నాలో లేనే లేను’, ‘ఎందుకు రా బాబు’ పాటలు కూడా తక్కువ సమయంలోనే 6 మిలియన్లు, 3 మిలియన్ల వీక్షణలను సంపాదించి సత్తా చాటాయి. ఈ మూవీ ట్రైలర్‌ను ఈనెల 18న విడుదల చేస్తున్నారు. భావోద్వేగాలు, ప్రేమ, హాస్యం, అద్భుతమైన సంగీతం కలగలిసిన ఈ విందుభోజనం లాంటి చిత్రం కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబందం నమ్మకంగా చెబుతోంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ రెండో వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.