నవతెలంగాణ -పెద్దవూర తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని మండల కాంగ్రెస్ అధ్యక్షులు పబ్బు యాదగిరి గౌడ్ అన్నారు. శనివారం పెద్దవూర మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…సంక్షేమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజారంజక పాలననే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలైన 6 గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను ప్రభత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే అమలుకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండలం అధ్యక్షులు కిలారి మురళీ కృష్ణ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వూరే వెంకన్న, నాయకులు నడ్డి లక్షమయ్య, కోట అంజి, పాకాల అంజయ్య, పున్ రెడ్డి శ్రీధర్ రెడ్డి, రాము శేఖర్ తదితరులు పాల్గొన్నారు.