తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ

– పైడాకుల అశోక్ ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట : తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన మహాతల్లి సోనియాగాంధీ అని ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో బస్టాండ్ చౌరస్తాలో ఇందిరా గాంధీ విగ్రహం ముందు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తెలంగాణా ప్రధాత,కాంగ్రేస్ పార్టీ అగ్రనాయకురాలు,తెలంగాణా తల్లి సోనియాగాంధీ   పుట్టినరోజు వేడుకలను నేడు మనం గర్వంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఆనాడు పార్లమెంటులో ప్రతిపక్షాల తో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచిన ఘనత సోనియా గాంధీ కే దక్కుతుందని అన్నారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోని అమ్మకు పుట్టినరోజు కానుకగా విజయాన్ని అందించారని అన్నారు. అదేవిధంగా సోనియమ్మ పుట్టినరోజు కానుకగా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. సుమారు పది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అందరము హర్షించదగ్గ విషయమని అన్నారు. అనంతరం పుట్టినరోజు సందర్భంగా భారీ కేకును కట్ చేసి అశోక్ కార్యకర్తలకు పంచారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ,అనుబందసంఘాల అధ్యక్షులు,జిల్లా నాయకులు,మండల నాయకులు,మహిళా నాయకురాళ్లు,సీనియర్ నాయకులు,అన్ని గ్రామాల నాయకులు,జడ్పీటీసీ, ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,యూత్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు మరియు పార్టీ కుటుంబసభ్యులందరూ కలిసి పాల్గొన్నారు.