నవతెలంగాణ – తాడ్వాయి
కాంగ్రెస్ ఊ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 79 వ జన్మదిన వేడుకలు సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత, తెలంగాణ తల్లి సోనియమ్మ అని అన్నారు. పార్టీ కోసం పదవులను తృణప్రాయంగా త్యజించిన త్యాగమూర్తి సోనియా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, మేడారం ట్రస్ట్ రోడ్ మాజీ చైర్మన్ అర్రేం లచ్చు పటేల్, పిఏసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరావు, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పీరీల వెంకన్న, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు భూషబోయిన రవి మాజీ సర్పంచులు బెజ్జూరి శ్రీనివాస్, ఇరుప సునీల్ దొర, మంకీడి నరసింహస్వామి, లంజ పెళ్లి నరసయ్య, ముజాఫర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు, నాయకులు తండాల శ్రీను, మహిళా నాయకులు ముండ్రాతి రాజశ్రీ, పురుషోత్తం నారాయణ, పాక రాజేందర్, కోటేష్, చిరంజీవి, నరేష్, శోభన్, నునావత్ శీను, మరి నరేష్, మద్దూరు రాములు, బండారు చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.