
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను సోమవారం కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి నిర్వహించారు. జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు ప్రయాణికులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ గౌడ్, నామాల రవి, బి పేట నరసింహులు, రంజిత్, గోపి, తదితరులు పాల్గొన్నారు.