తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కానుక.. సోనియా గాంధీ కృషి

కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ-భూపాలపల్లి
సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కానుకగా ఇచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం అయిందని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టౌన్‌ ప్రెసిడెంట్‌ ఇస్లావత్‌ దేవన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యా లయంలో అంబేడ్కర్‌ సెంటర్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గండ్ర సత్య నారాయణరావు, డీసీసీ ప్రెసిడెంట్‌ అయిత ప్రకాష్‌ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో, అంబేడ్కర్‌ చౌరస్తా లో జెండా ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జీఎస్సార్‌ మీడియా తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1200మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారని, అది చూసి సోనియా గాంధీ చలించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్లు జీఎస్సార్‌ గుర్తు చేశారు. ఈరోజు నుండి 21 రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట సీఎం కేసీఆర్‌ ప్రజాధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, ముఖ్య నాయకులు గద్దె సమ్మిరెడ్డి, గంట దేవేందర్‌ రెడ్డి, విన్నపురెడ్డి మహేష్‌ రెడ్డి, వెంపటి భువన సుందర్‌, బుర్ర కొమురయ్య, బట్టు కరుణాకర్‌, అంబాల శ్రీనివాస్‌, పోనకంటి శ్రీనివాస్‌, భౌతు రాజేష్‌, పిప్పాల రాజేందర్‌, నగునూరి రజినీకాంత్‌ గౌడ్‌, సుభాష్‌, ఉస్మాన్‌, బుర్ర రజనీకాంత్‌ గౌడ్‌, పథ్వీరాజ్‌, తోట రంజిత్‌ తదితరులు ఉన్నారు.