– అందుబాటులో టెక్ట్స్ బుక్స్
– జిల్లా నోడల్ అధికారి, బొంరాస్‌పేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ పిన్సిపాల్
నవతెలంగాణ-బొంరాస్‌పేట్
బొంరాస్‌పేట్ మండలానికి కొత్తగా జూనియర్ కళాశాల మంజూరైన నేపథ్యంలో కాలేజీలో త్వరలోనే తరగతులు ప్రారంభిస్తా మని జిల్లా నోడల్ అధికారి శంకర్‌నాయక్, ప్రభుత్వ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ విజయకుమార్ తెలిపారు. మంగళవారం కళాశాలకు కేటాయించిన భూమిని సందర్శిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేజీలో ప్రవేశాల కోసం జడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లను కలిసినట్టు తెలిపారు. కళాశాలకు సంబంధించి తరగతి గదులను కేటాయించాలని కోరినట్టు చెప్పారు. వారు సానుకూలంగా స్పందించి కేటాయించడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్‌కి వెళ్లి కళాశాలకు కేటాయించిన భూమికి సంబంధించిన రికార్డ్స్ తీసుకున్నట్టు తెలిపారు. కళాశాలకు జనరల్ గ్రూప్‌లు అయినా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఇసీలతో పాటుగా నూతనంగా ఒకేషనల్ కోర్సులైన ఎంపీహెచ్‌డబ్ల్యు, ఎంఎల్‌టీ గ్రూపులు అందుబాటులో ఉన్నట్టు వివరించారు. అకాడమీక్ ఈయర్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు కాలేజీలో జాయిన్ కావాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో మండలంలో కాలేజీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని మండలంలోని విద్యార్థులతోపాటు ఇతర మండలాల విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కాలేజీకి 4000 పుస్తకాలు
కాలేజీకి సుమారు 4వేల పుస్తకాలు వచ్చినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. వివిధ గ్రూపులకు చెందిన పుస్తకాలు కాలేజీకి చేరినట్టు తెలిపారు. వి ద్యార్థులు జాయిన్ అయిన వెంటనే వారికి పుస్తకాలు అందజేస్తామ న్నారు. విద్యార్థులకు విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు.