త్వరలోనే తంగలాన్‌ 2

Soon Tangalan 2విక్రమ్‌ హీరోగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ‘తంగలాన్‌’. ఈ నెల 15న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అందుకుంది. ఈ చిత్రాన్ని పా రంజిత్‌ దర్శకత్వంలో నీలమ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ, ‘ఎంతో పోటీలో రిలీజైన మా సినిమాకు మంచి సక్సెస్‌ అందించారు తెలుగు ప్రేక్షకులు. మరిన్ని స్క్రీన్స్‌ యాడ్‌ అవుతున్నాయి. మాకు ఒక ఎపిక్‌ మూవీని ఇచ్చిన పా రంజిత్‌కు థ్యాంక్స్‌’ అని తెలిపారు. ‘మా సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. ”తంగలాన్‌” ఒక డిస్కషన్‌ మొదలయ్యేలా చేసింది’ అని దర్శకుడు పా.రంజిత్‌ తెలిపారు. హీరో విక్రమ్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా రిలీజ‌కు ముందే నేను పా రంజిత్‌, జ్ఞానవేల్‌కి చెప్పాను. ఇది తెలుగు ఆడియెన్స్‌ బాగా రిసీవ్‌ చేసుకునే సినిమా అవుతుందని. ఎందుకంటే ఇది మట్టి మనుషుల కథ. ‘తంగలాన్‌’కు పార్ట్‌ 2 చేయాలని నేను, పా రంజిత్‌, జ్ఞానవేల్‌ అనుకున్నాం. తప్పకుండా ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుంది’ అని అన్నారు.