
మండలంలోని దేగామ గ్రామనికి చెందిన యువసేన యూత్ సభ్యులు కలిసి వారి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మంగళవారం 20 వేల రూపాయలతో సౌండ్ బాక్స్ ను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న మరెన్నో సమస్యలకు ముందుకు అడుగేస్తామని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతామని యువసేన యూత్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాటశాల ప్రధాన ఉపాద్యాయులు రాంకిషన్, ఉపాద్యాయులు, జగదీష్ రెడ్డి , లింగన్న, ప్రతాప్ సింగ్, సుభాష్, గణేష్, రేణుక, యువసేన యూత్ అధ్యక్షులు కొక్కుల ఉదయ్, యూత్ సభ్యులు నరేష్, గాంధీ, వెంకటేష్, ప్రశాంత్, తరుణ్, ఆక్షిత్, సాయి, శేఖర్ తది తరులు పాల్గొన్నారు.