
మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్నా దక్షిణ ప్రాంగణంలోని జియో ఇన్ఫర్మేషన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయ కళాశాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయ ఎంపికలో భాగంగా క్యాంపస్ ప్రిన్సిపాల్ ఎంపికయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు ఎంపిక అవడం పట్ల క్యాంపస్ ప్రొఫెసర్లు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.