
ఇందూరు తిరుమల గోవిందా వనమాల క్షేత్రాన్ని శుక్రవారం సౌత్ సెంట్రల్ రైల్వే ఛీఫ్ ఇంజినీయర్ శ్రీ ఆంజనేయ రెడ్డి సందర్శించడం జరిగింది. వివిధ రైల్వే స్టేషన్ల ఇన్స్పెక్షన్ల భాగంలో శుక్రవారం రోజున నిజామాబాద్ జిల్లాకి రావటం జరిగింది. అందులో భాగంగా సౌత్ సెంట్రల్ ఛీఫ్ ఇంజినీయర్ ఆంజనేయ రెడ్డి మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆంజనేయ రెడ్డి ఆలయ కేంద్రంగా చేస్తున్న ఆధ్యాత్మిక ప్రకృతి సేద్యాన్ని చూసారు. గోశాలలో సంచరించి గోసేవ చేసుకున్నారు.. కట్టె గానుగ యూనిట్ కూడ సందర్శించారు. ఆలయం కేంద్రంగా సమాజ నిర్మాణం కోసం పని చేస్తున్న ఆలయ ధర్మకర్త నర్సింహారెడ్డి ని వారు అభినందించారు. గుడి చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణ చూసి ఎంతో సంతోషించారు ఆయనతో పాటు ఏ ఈ శ్రీహరి , ఆలయ సేవకులు నరాల సుధాకర్, ప్రవీణ్, పృథ్వి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.