
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక:
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు లేదా రూపాయాలు రూ.25 లక్షలు యులిప్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక వైపు మొగ్గు చూపుతున్నారు. ఎల్ టి జి సి టాక్స్ రేట్ 12.5%, యులిప్‌లో వార్షిక పెట్టుబడి రూ. 1.25 లక్షల వరకు పన్ను రహితం కాబట్టి, ఇది ప్లాన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. డిమాండ్ పెరగడానికి దారితీసింది. వార్షిక పెట్టువాడి దాదాపు రూ.2.5 లక్షలు ఉంది అని అన్నారు.
సమగ్ర సౌలభ్యం:
కొనుగోలు నుండి కస్టమర్ సేవ వరకు దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో అధిక సంఖ్యలో కస్టమర్‌లు తమ సౌలభ్యం మేరకు తమ ఇల్లు లేదా కార్యాలయంలో బీమాను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. తెలంగాణలో 35% మంది కస్టమర్లు ఇంటి వద్ద కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపగా, హైదరాబాద్‌లో 33% మంది వినియోగదారులు ఇంటి వద్ద పాలసీ కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. వాస్తవానికి, దాదాపు 60% పాలసీ బుకింగ్‌లు ఈ సందర్శనల ద్వారానే జరుగుతున్నాయి. టైర్-2 టైర్-3 నగరాల్లోని చాలా మంది కస్టమర్‌లు తమ బీమా సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఆన్‌లైన్ సంభాషణలతో పాటు కార్యాలయాలను సందర్శించడాన్ని ఇష్టపడుతున్నారు. హైదరాబాద్‌లో 500+ సలహాదారులతో పాలసీ బజార్ భౌతిక కార్యాలయాలు వినియోగదారులకు సమగ్ర మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి.