సియోల్ : దక్షిణ కొరియాను గందరగోళంలోకి నెట్టిన మార్షల్ లా విధింపులో కీలక పాత్రధారుల్లో ఒకరైన రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్‌ను అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. సైనిక పాలన యత్నం విఫలమైన తరువాత రక్షణ మంత్రిగా యోంగ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంటులో అధ్యక్షుడు యూన్‌సుక్ యోల్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మూడింట రెండొంతుల మెజార్టీ లభించనందున అది ఆటోమేటిక్‌గా రద్దయింది. ఈ పరిణామం జరిగిన మరుసటి రోజే రక్షణ శాఖ మాజీ మంత్రి అరెస్టు కావడం గమనార్హం.ఆయన ఇతర దేశాలకు పారిపోకుండా ప్రయాణాలపై నిషేధం విధించింది. అధ్యక్షుడు యూన్, మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ సహా ఇతరులపై తిరుగుబాటు ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కిమ్‌యోంగ్ అరెస్ట్‌పై అధికార యంత్రాంగం స్పందించాల్సి వుంది.