నైరుతి నేస్తం

ఉక్కపోతలతో
ఊపిరి సలపని రోజులు
ఎంతగానో మనిషిని
ఉక్కిరి, బిక్కిరి చేశాయో
భూమి అంటకాగుతూ
దేహాలు మరెంతగా అల్లాడాయో

చెట్టు నిర్జీవం అవుతూ
పక్షులు సైతం ఎండ వేడికి అల్లాడుతూ
ఎంతగా పరితపించి పోయాయో
కొండలు పగిలే వేడి ఉద్రితికి
ఎన్ని ఉదయాలు ఊపిరి సలపని గంటలతో
భారంగా మనిషి బతుకుని
ఎంత దుర్భరంగా మోసాయో

ఒక చిన్న తీపి కబురు
ఊపిరి పిట్టలా
నైరుతి నడయాడుతూ వస్తోందనీ…
ఆహా… ఎంత తియ్యని అనుభూతో
వినడానికే మనసు ఎంత త్రుళ్ళి పడుతోందో
నైరుతి నాలుగు దిక్కుల్ని పలకరిస్తే
పండు వెన్నెల స్పర్శ మదిని మీటిపోదూ…

కొన్ని చినుకులు ఆత్మీయమైన రాలితే
మరికొన్ని చిటపటలు నేలను ముద్దాడి మురిపిస్తే
నేల పచ్చని ఆకృతులతో
మురిసి తబ్బుబ్బి పోదూ…
కాళీ కుండలైన బావులూ, నదులూ నవ్వుతూ
రైతు కలల్ని మీటి మురిసిపోవూ…
రైతన్న ఏరువాక నడకలో
నైరుతి నేస్తం పలరింపులో హలం హర్షంతో
ఉప్పొంగి పోదూ…
మహబూబ్‌ బాషా చిల్లెం
సెల్‌: 9502000415