– జలమయమైన హైదరాబాద్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఖమ్మం జిల్లాలో ఈ నెల 22న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. శనివారం నాటికి అన్ని జిల్లాలకు అవి విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురియనున్నట్టు ఆ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా పడే అవకాశముంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది.