కామారెడ్డి జిల్లాలో 91935 ఎకరాలలో సోయాబీన్ పంట సాగు

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 91935 ఎకరాలలో సోయాబీన్ పంటను సాగు చేయడం జరిగిందని జిల్లా మార్క్ఫెడ్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి గాను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్క్ఫెడ్ తరపున రైతులకు మద్దతు ధర క్వింటాల్ కు రూ. 4892/- లభించడం కోసం (9) కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 01.01. 25 వరకు (8071) రైతుల నుండి 137871 క్వి లు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తదుపరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 07.01.25 వరకు మాత్రమే సోయాబీన్ కొనుగోలు జరుగుతుందనీ ఆ ప్రకటనలో వారు తెలిపారు.