నవతెలంగాణ – సిరిసిల్ల
ప్రతీ ఒక్క పోలీస్ అధికారి శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని, శారీరకంగా దృడంగా ఉన్నపుడే విధులు సక్రమంగా నిర్వహించగలరని, అందులో భాగంగానే జిల్లా పోలీస్ అధికారులకు అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన జిమ్ అందుబాటులోకి తీసుకరవడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన జిమ్ ను పోలీస్ అధికారులతో కలిసి ఎస్పీ ప్రారంభించి మాట్లాడుతూ నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే సిబ్బందికి ,విధులతో పాటుగా ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఆకాంక్షించారు. జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారుల సంక్షేమనికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులు , సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటానికి ఈ జిమ్ అందుబాటులోకి తీసుకరావడం జరిగిందని అన్నారు.పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక,వ్యాయామం, యోగ వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలని అన్నారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి కోచ్ తో సహా అత్యాధునిక జిమ్ అందుబాటులోకి తీసుకవచ్చిన జిల్లా ఎస్పీకి అధికారులు సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,ఆర్.ఐ లు మాధుకర్, యాదగిరి, సి.ఐ కృష్ణ, మోగిలి, ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.