జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, ఉట్నూరు ఎ ఎస్పీ కాజల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్ రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్క అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం మరింత ఉత్సాహంతో జిల్లా ప్రజలకు సేవలందించాలని న్యాయమూర్తి తెలిపారు. ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం జిల్లా ప్రజలకు అందిస్తూ సేవలందించాలని కోరుకున్నారు. నూతన సంవత్సరం వీరికి మరింత ఆయురారోగ్యాలు ఉన్నత స్థానాలకు ఎదగాలని తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు పెండింగ్ కేసులపై అధికారులు ఇరువురు చర్చించారు. వీరితో పాటు ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ సబ్ డివిజన్ సిబ్బంది, సైబర్ క్రైమ్ డి.ఎస్.పి హసీబిల్లా ప్రధాన న్యాయమూర్తికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.